Andhra Pradesh: పవన, సౌర విద్యుత్ కొనుగోలు చేయలేదని వస్తున్న వార్తలు అవాస్తవం: విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్

  • రాష్ట్రంలో విద్యుత్ కోతలు
  • స్పందించిన విద్యుత్ శాఖ కార్యదర్శి
  • సింగరేణి నుంచి బొగ్గు వస్తోందని వెల్లడి

రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. బొగ్గు కొరత కారణంగానే విద్యుత్ ఉత్పాదన తగ్గిందని ప్రభుత్వం వివరణ ఇస్తున్నా, విమర్శల తాకిడి తప్పడంలేదు. ఈ నేపథ్యంలో, ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్ ను కొనుగోలు చేయవచ్చు కదా అని కూడా స్పందనలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. పవన, సౌర విద్యుత్ కొనుగోలు చేయలేదని వస్తున్న వార్తలు అవాస్తవాలని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా గత 10 రోజులుగా విండ్, సోలార్ విద్యుదుత్పత్తి సరిగా లేదని తెలిపారు. వచ్చే 7 రోజుల పాటు 8 ర్యాకుల చొప్పున బొగ్గు సింగరేణి నుంచి వస్తోందని, కేఎస్కే థర్మల్ కేంద్రానికి రూ.120 కోట్లు చెల్లించామని వెల్లడించారు.

Andhra Pradesh
Thermal
Power
Singareni
  • Loading...

More Telugu News