Kodela: కోడెలను వేధిస్తూ విజయసాయిరెడ్డి ప్రతిరోజు ట్వీట్లు పెట్టారు.. ఆయన మరణంతో ఏం సాధించారు?: దేవినేని ఉమ

  • బాంబులకు కూడా కోడెల భయపడలేదు
  • నీచ రాజకీయాలకు బలయ్యారు
  • వైయస్ మరణం తర్వాత ఆయన కుటుంబం అధికార నివాసంలో ఎందుకుంది?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బాంబులకు కూడా భయపడలేదని... నీచ రాజకీయాలకు బలయ్యారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తప్పుడు కేసులపై ఆయన కలత చెందారని... ఇదే అంశంలో తమను కూడా పలు మార్లు హెచ్చరించారని చెప్పారు. కోడెలను వేధిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిరోజూ ట్వీట్లు పెట్టారని మండిపడ్డారు. కోడెల మరణంతో జగన్ ప్రభుత్వం ఏమి సాధించిందని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత సీఎం అధికారిక నివాసంలో జగన్ కుటుంబం 9 నెలల పాటు అనధికారికంగా ఎందుకుందని అడిగారు.

Kodela
Devineni Uma
Vijayasai Reddy
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News