Karimnagar District: ఆర్టీసీ బస్సును కారుతో ఢీకొట్టి.. ఆపై బస్సు డ్రైవర్‌పైనే యువకుల దాడి

  • కరీంనగర్‌లో ఘటన
  • రాంగ్ రూటులో వచ్చి ఆర్డీసీ బస్సును ఢీకొట్టిన యువకులు
  • డ్రైవర్ ఫిర్యాదుతో యువకుల అరెస్ట్

కారులో రాంగ్‌రూటులో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడమే కాకుండా, తిరిగి ఆర్టీసీ డ్రైవర్‌పైనే యువకులు దాడికి దిగిన ఘటన కరీంనగర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన అదిబ్ అనే యువకుడు ఆదివారం సాయంత్రం తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్నాడు. కరీంనగర్ కమాన్ దగ్గరకు రాగానే కారును రాంగ్‌రూట్‌లోకి పోనిచ్చి మితిమీరిన వేగంతో నడిపాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు.

కారును రాంగ్ రూటులో నడపడమే కాకుండా ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన అదిబ్ ఆగ్రహంతో కారు దిగి బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌తో గొడవకు దిగి దాడి చేశాడు. బస్సులోకి వెళ్లి డ్రైవర్‌ను కిందికి లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. గమనించిన స్థానికులు, ప్రయాణికులు అతడిని అడ్డుకోవడంతో తోకముడిచాడు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదిబ్‌, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Karimnagar District
Telangana
Road Accident
RTC driver
  • Loading...

More Telugu News