kodela sivaprasad: భారీ పోలీసు బందోబస్తు మధ్య కోడెల విగ్రహ దిమ్మె కూల్చివేత

  • లింగాపురంలో ఆదివారం రాత్రి ఘటన
  • అనుమతి లేదంటూ దిమ్మెను కూల్చేసిన అధికారులు
  • గ్రామంలో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రామంలో దిమ్మె ఏర్పాటు చేశారు. పాలకేంద్రం వద్ద దిమ్మెను నిర్మించిన టీడీపీ నేతలు నేడు విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు.

అయితే, విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవని ఆదివారం రాత్రి పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు విగ్రహ దిమ్మెను కూల్చివేశారు. పర్యవసానంగా గ్రామంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

kodela sivaprasad
Andhra Pradesh
Guntur District
yadlapadu
  • Loading...

More Telugu News