Andhra Pradesh: సమ్మెలు, వర్షాలతో బొగ్గు ఉత్పత్తి తగ్గింది: ఏపీ సర్కారు ప్రకటన
- రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు
- ప్రకటన చేసిన ఏపీ సర్కారు
- 57 శాతానికి పైగా బొగ్గు సరఫరా తగ్గిందని వెల్లడి
రాష్ట్రంలో అనూహ్య రీతిలో విద్యుత్ కోతలు విధిస్తుండడం పట్ల ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏపీ జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత నెలకొందని ఆ ప్రకటనలో తెలిపారు. 57 శాతానికి పైగా బొగ్గు సరఫరా తగ్గిందని వివరించారు. ప్రమాదాలు. సమ్మెలు, భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని ప్రభుత్వం తమ ప్రకటనలో పేర్కొంది.
ఆగస్టులో డొంకరాయి-దిగువ సీలేరులో పవర్ కెనాల్ కు గండి పడిందని, పునరుద్ధరణ పనులకు భారీ వర్షాలతో ఆటంకం ఏర్పడిందని వివరించింది. మరోవైపు గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఇతర రాష్ట్రాల నుంచి అప్పుగా విద్యుత్ తీసుకున్నామని తెలిపింది.