Ravikumar: కూన రవికుమార్ పై అక్రమ కేసులు పెట్టారు: చినరాజప్ప

  • కూన రవికుమార్ పై కేసు
  • కక్ష సాధింపు అంటూ చినరాజప్ప వ్యాఖ్యలు
  • కోడెలను ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని ఆరోపణ

టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ పై ఇటీవలే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనతో పాటు మరో 11 మంది వ్యక్తులపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. కూన రవికుమార్ పై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రవిని కలిశామని, వైసీపీ ప్రభుత్వానికి కక్ష సాధింపులు తప్ప సంక్షేమం పట్టదని విమర్శించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని చినరాజప్ప అన్నారు.

Ravikumar
Nimmakayala Chinarajappa
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News