enowment dept.: హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగాలు...ఏపీ ప్రభుత్వం జీవో

  • అన్యమతస్తులు ఇకపై వేరే శాఖల్లోకి వెళాల్సిందే
  • సంచలన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • దేవదాయ శాఖకు తనిఖీ అధికారాలు

ఆంధ్రప్రదేశ్‌లోని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అన్యమతస్థులను అనుమతించరు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా అన్యమతస్తులు ఆయా దేవాలయాల పరిధిలో పనిచేస్తుంటే వారిని వేరే శాఖల్లోకి మార్పుచేయాలని ప్రభుత్వం తన జీవోలో ఆదేశించింది.

అలాగే, అన్యమతస్తులైన ఉద్యోగుల ఇళ్లలో జరిగే పండుగలు, పెళ్లిల్లు, ప్రార్థనలకు సంబంధించిన వీడియోలను విజిలెన్స్‌ శాఖకు లేదా దేవాదాయ శాఖకు అందజేస్తే వాటికి సంబంధించిన నిజనిర్ధారణ కోసం అధికారులు ఆకస్మిక తనిఖీలు జరుపుతారు. అయా సమాచారం నిజమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు.

enowment dept.
CM jagan
hindus
temples
  • Loading...

More Telugu News