Telangana: కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే: టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

  • కేటీఆర్, ఉత్తమ్ లు పొద్దున్న దూషించుకుంటారు
  • రాత్రి సమాలోచనలు జరుపుతారు
  • తెలంగాణలో ప్రభుత్వం అవినీతిమయం

తెలంగాణలో ప్రభుత్వం అవినీతిమయం అని టీ-బీజేపీ అధ్యక్షుడు ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కుటుంబ పాలనపై బీజేపీ పోరాడుతోందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని చెప్పడానికి చాలా ఉదంతాలు ఉన్నాయని అన్నారు.

కేటీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు పొద్దున్నదూషించుకుంటారు, రాత్రి సమాలోచనలు జరుపుతారని విమర్శించారు. హుజూర్ నగర్ లో త్వరలో జరిగే ఉపఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ కి వేసినట్టేనని అన్నారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Telangana
cognress
TRS
BJP
Laxman
  • Loading...

More Telugu News