East Godavari District: మునిగిపోయిన లాంచీని వెలికితేసే పనులు సత్యం బృందానికి అప్పగింత!

  • ఈ పనుల నిమిత్తం దాదాపు రూ.22 లక్షలు
  • సంఘటనా స్థలానికి తరలించనున్న భారీ క్రేన్లు, ప్రొక్లైన్లు
  • రేపటి నుంచి లాంచీ వెలికితీసే పని

తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల మునిగిపోయిన లాంచీని వెలికితేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. లాంచీని వెలికితీసే పనులను కాకినాడకు చెందిన సత్యం, అతని బృందానికి అప్పగించింది. ఈ పనులకు దాదాపు రూ.22 లక్షలు వెచ్చిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సంఘటనా స్థలానికి భారీ క్రేన్లు, ప్రొక్లైన్లు తరలించే పనుల్లో ఉన్నారు. అవసరమైన సామాగ్రి చేరుకోగానే లాంచీని వెలికితీసే పనులు ప్రారంభిస్తామని సత్యం బృందం తెలిపింది.

లాంచీని వెలికితీసే పనులు రేపటి నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 36 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 15 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

East Godavari District
kachuluru
Boat
Accident
  • Loading...

More Telugu News