Telugudesam: గోదావరిలో బోటు ముంచి ఢిల్లీలో అవార్డు తీసుకోవడానికి సిగ్గుండాలి: అవంతిపై మంతెన ఫైర్

  • అవార్డు ఎవరి కృషి ఫలితమో తెలుసుకోవాలన్న మంతెన
  • బోటు ప్రమాదానికి అవంతే కారణమని ఆరోపణ
  • ఇంతవరకు బోటు వెలికితీయలేకపోయారని విమర్శలు

గోదావరిలో పడవ ప్రమాదానికి మంత్రి అవంతి శ్రీనివాసే కారకుడని టీడీపీ నేత మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. గోదావరిలో బోటు ముంచి ఢిల్లీలో అవార్డు తీసుకోవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. టీడీపీ చేసిన అభివృద్ధికి వైసీపీ వాళ్లు అవార్డు తీసుకోవడం శోచనీయం అని పేర్కొన్నారు. పర్యాటక రంగంలో అవార్డు ఎవరి కృషి వల్ల వచ్చిందో ఆలోచించాలని అన్నారు. గోదావరికి ఉద్ధృతమైన వరద వస్తున్న సమయంలో బోటుకు ఎలా అనుమతినిచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని మంతెన వ్యాఖ్యానించారు. బోటు మునిగి 15 రోజులు అవుతున్నా ఇంతవరకు బోటును బయటికి తీయలేదని విమర్శించారు.

Telugudesam
Mantena
Avanthi
YSRCP
Godavari
Boat
  • Loading...

More Telugu News