Kona Venkat: టాలీవుడ్ రచయిత కోన వెంకట్ పై చీటింగ్ కేసు నమోదు

  • చిక్కుల్లో పడిన కోన వెంకట్
  • కథ ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ ఫిర్యాదు
  • 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

టాలీవుడ్ లో రచయితగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. కథ ఇస్తానని చెప్పి రూ.13.5 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కోన వెంకట్ పై జెమిని ఎఫ్ఎక్స్ సంస్థ డైరెక్టర్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. సినిమా కథ ఇవ్వకపోగా, డబ్బు కూడా తిరిగివ్వనని తమనే బెదిరిస్తున్నారంటూ ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోన వెంకట్ పై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Kona Venkat
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News