Chandrababu: చంద్రబాబు ఎంత రాద్ధాంతం చేసినా చర్యలు తప్పవు: వైసీపీ ఎమ్మెల్యే కాకాణి

  • చంద్రబాబు హయాంలో అక్రమాలు జరిగాయి
  • ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లింది
  • ప్రజలపై 30 శాతం అదనపు భారం పడింది

నాడు చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏల వల్ల ప్రజలపై 30 శాతం అదనపు భారం పడిందని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్న కోపంతోనే వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎంత రాద్ధాంతం చేసినా ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. థర్మల్ విద్యుత్ మిగులు ఉన్నా, సంప్రదాయేతర ఇంధనం పేరిట అధిక ధరలతో విద్యుత్ ను చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపించారు.

Chandrababu
Telugudesam
YSRCP
mla
kakani
  • Loading...

More Telugu News