TTD: తిరుమల పవిత్రతను దెబ్బతీసినందుకు భక్తులకు జగన్ క్షమాపణలు చెప్పాలి: అచ్చెన్నాయుడు

  • నేరచరిత్ర కలిగిన వారు టీటీడీ బోర్డులో ఉన్నారు
  • శేఖర్ రెడ్డిని సభ్యుడిగా ఎలా నియమిస్తారు?
  • వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి?

నేరచరిత్ర కలిగిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో ఉన్నారని, శేఖర్ రెడ్డిని సభ్యుడిగా నియమించడంపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తిరుపతిలో పచ్చ వజ్రం దాచేశారని గత ప్రభుత్వంపై అభాండాలు వేసిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని, తిరుమల పవిత్రతను దెబ్బతీసినందుకు భక్తులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

TTD
Sheker reddy
Telugudesam
Atchanaidu
  • Loading...

More Telugu News