Jagan: సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి.. ఇంతటి అసమర్థుడిని ఎప్పుడూ చూడలేదు: హర్షకుమార్

  • గోదావరిలో బోటు మునిగి ఇన్ని రోజులైనా బయటకు తీయలేకపోయారు
  • నేవీ వాళ్లు ఎందుకు వెళ్లిపోయారో ఎవరికీ తెలియదు
  • ఎవరైనా సమర్థుడికి సీఎం పదవిని అప్పగించాలి

గోదావరిలో బోటు మునిగి 13 రోజులైనా ఇంతవరకు బయటకు తీయడం చేతకాని ముఖ్యమంత్రి జగన్ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అసమర్థత అని అన్నారు. బోటును తీయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు. బోటు మునిగిన మరుసటి రోజే అది ఎక్కడుందో గుర్తించారని... ఆ మరుసటి రోజు నేవీ వాళ్లు బోటుకు సంబంధించిన ఓ అద్దాన్ని పగలగొట్టారని... ఆ తర్వాత తాము బోటును వెలికి తీయలేమంటూ వెళ్లిపోయారని... వారు ఎందుకు వెళ్లిపోయారనేది ఎవరికీ తెలియని విషయమని చెప్పారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో 144 సెక్షన్ పెట్టారని, వాస్తవాలను బయటకు రానీయకుండా చేసేందుకు మీడియాను అనుమతించడం లేదని హర్షకుమార్ మండిపడ్డారు. బోటును బయటకు తీయించడం కూడా చేతకాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని... వైసీపీలో ఎవరైనా సమర్థులుంటే వారికి సీఎం పదవిని అప్పజెప్పాలని అన్నారు. ఇంతటి అసమర్థుడైన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదని విమర్శించారు.

Jagan
Harsha Kumar
Boat Accident
YSRCP
  • Loading...

More Telugu News