Chiranjeevi: 152వ సినిమాకు హీరోయిన్ ను ఖరారు చేసిన చిరంజీవి!

- చిరు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం
- హీరోయిన్ గా ప్రచారంలోకి వచ్చిన పలువురి పేర్లు
- చివరకు త్రిషను ఫైనలైజ్ చేసిన చిరంజీవి
టాలీవుడ్, కోలీవుడ్ లో కొన్నేళ్లపాటు అగ్రనాయికగా కొనసాగిన త్రిష... ఓ వెలుగు వెలిగింది. టాప్ హీరోలందరి సరసన ఎన్నో సినిమాలు చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆమె కొంత వెనుకబడిపోయింది. తమిళంలో బిజీగానే ఉన్నప్పటికీ... తెలుగు సినిమాలకు మాత్రం దూరంగా ఉంది. ఈ తరుణంలో, త్రిష బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ సంపాదించింది.
