Maruti Suzuki: బాలెనో కారుపై భారీ డిస్కౌంట్.. లక్ష రూపాయలు తగ్గించిన మారుతి సుజుకి!

  • అన్ని మోడళ్లపై రెండు రోజుల క్రితం రూ. 5 వేలను తగ్గించిన మారుతి
  • బాలెనో ఆర్ పై రూ. లక్ష తగ్గింపు
  • ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5,58,000

దసరా పండుగ సందర్భంగా వినియోగదారులకు మారుతి సుజుకీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెక్సా సిరీస్ కు చెందిన బాలెనో ఆర్ మోడల్ కార్లపై ఏకంగా రూ. లక్ష తగ్గించింది. కొన్ని సెలెక్టెడ్ మోడళ్లపై రెండు రోజుల క్రితమే రూ. 5 వేలను తగ్గిస్తున్నట్టు మారుతి ప్రకటించింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత... మారుతి సుజుకి ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో బాలెనో ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధరను రూ. 5,58,000గా నిర్ణయించింది. దీపావళి సీజన్ లో కూడా కార్ల ధరలను తగ్గించే యోచనలో మారుతి యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. మారుతి తీసుకున్న నిర్ణయంతో ఇతక కంపెనీలు కూడా ధరలను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల చెబుతున్నారు.

Maruti Suzuki
Baleno
Price
  • Loading...

More Telugu News