Andhra Pradesh: 50 శాతం రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

  • నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు
  • 50 శాతం రిజర్వేషన్లలో సగ భాగం మహిళలకు కేటాయింపు
  • అన్ని పదవుల్లో రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా రిజర్వేషన్ల అమలుకు విధివిధానాలతో కూడిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ 50 శాతం రిజర్వేషన్లలో బీసీ, మైనార్టీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం పదవులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా... ఈ 50 శాతం రిజర్వేషన్లలో 50 శాతాన్ని మహిళలకు కేటాయించింది. అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఈ రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలను జారీ చేసింది.

Andhra Pradesh
Nominated Posts
Reservations
  • Loading...

More Telugu News