Sharad Pawar: శరద్ పవార్ కు మద్దతుగా నిలిచిన శివసేన

  • బ్యాంకు కుంభకోణంలో శరద్ పవార్ ప్రమేయం లేదు
  • కుంభకోణం వెలుగు చూసిన సమయంలో ఆయన అధికారంలో కూడా లేరు
  • బ్యాంకుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు

మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కుంభకోణం కేసులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బీజేపీ మిత్రపక్షమైన శివసేన నుంచి మద్దతు లభించింది. ఈ కుంభకోణంలో శరద్ పవార్ ప్రమేయం లేదని శివసేన కీలకనేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కుంభకోణం వెలుగు చూసిన సమయంలో ఆయన అధికారంలో కూడా లేరని చెప్పారు. పవార్ పెద్ద నాయకుడని... ఇలాంటి కేసుల్లో ఆయన పేరును లాగడం వల్ల మహారాష్ట్రలో అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని అన్నారు. కోఆపరేటివ్ బ్యాంకుకు, పవార్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కుంభకోణంలో పవార్ పేరును చేర్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈడీ సంప్రదించి ఉండాల్సిందని అన్నారు.

Sharad Pawar
NCP
Shivsena
ED
  • Loading...

More Telugu News