YSRCP: శకుని మామా, ఆ విషయం ఇంకా నీకు అర్థం కాలేదా?: విజయసాయిరెడ్డిపై బుద్ధా విమర్శలు

  • గతంలో రాసిన స్క్రిప్ట్ తో ఐఏఎస్ అధికారులనూ జైల్లో కూర్చోబెట్టారు
  • ఇప్పుడు రివర్స్ టెండరింగ్, ఎలక్ట్రిక్ బస్సులు.. అంటూ  సంతకాలు పెట్టమంటున్నారు
  • సంతకాలు పెట్టి జైలుకెళ్లేందుకు అధికారులు సిద్ధంగా లేరు

‘స్క్రిప్ట్ మార్చు శకుని మామా’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోమారు విమర్శలు చేశారు. గతంలో రాసిన స్క్రిప్ట్ తో ఐఏఎస్ అధికారులని కూడా జైల్లో కూర్చోబెట్టారని, రివర్స్ టెండరింగ్, ఎలక్ట్రిక్   బస్సులు, భూ సర్వే కోసం కొత్త టెక్నాలజీ అంటూ సంతకాలు పెట్టమంటే అమాయకంగా సంతకాలు పెట్టి జైలుకి వెళ్లడానికి అధికారులు సిద్ధంగా లేరని, ‘ఆ విషయం ఇంకా నీకు అర్థం కాలేదా? నీ బది‘లీలలు’ త్వరలోనే బయటకు వస్తాయి’ అంటూ వరుస ట్వీట్లు చేశారు.

 ‘కిలోమీటర్ల లెక్కన నొక్కేసే ప్రతి రూపాయికి లెక్క రాసుకో. ఎందుకంటే తిరిగి ఇచ్చేయాలి కదా లేకపోతే లావైపోతావు శకుని మామా!’ అని విమర్శించారు. రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేసి కవల పిల్లలు గాలి, జగ్గు చేసిన మైనింగ్ సంగతిని మర్చిపోయావా శకుని  మామా? ఎలా మర్చిపోతావ్ లే లెక్క రాసింది నువ్వేగా. అన్నట్టు బాక్సైట్ మైనింగ్ అని ఏదో అంటున్నావ్ ఏంటా సంగతి ? ’ అని ప్రశ్నించారు.

YSRCP
Vijayasai reddy
Telugudesam
Budha
  • Error fetching data: Network response was not ok

More Telugu News