Uttam Kumar Reddy: కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో చెల్లుతుందా?: కర్నె ప్రభాకర్

  • రాహుల్ గాంధీని కూడా ఉత్తమ్ బచ్చాగానే భావిస్తున్నారా?
  • కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయాల్లో కొనసాగనని ఉత్తమ్ చెప్పారు
  • హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే గెలుపు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బచ్చా అని వ్యాఖ్యానించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీని కూడా ఉత్తమ్ బచ్చాగానే భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ది కుటుంబ పాలన అని విమర్శించే ఉత్తమ్ కుమార్ రెడ్డి... హుజూర్ నగర్ లో ఆయన భార్యను పోటీకి ఎలా నిలుపుతారని అన్నారు. కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయాల్లో కొనసాగనని ఉత్తమ్ అన్నారని గుర్తు చేశారు. ఉత్తమ్ ఎన్ని అబద్ధాలను ప్రచారం చేసినా హుజూర్ నగర్ లో నూటికి నూరు శాతం టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని చెప్పారు.

Uttam Kumar Reddy
KTR
Rahul Gandhi
Karne Prabhakar
TRS
Congress
  • Loading...

More Telugu News