Criminal: 1000 కేసులున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నెల్లూరులో అరెస్ట్

  • హర్యానా కేటుగాడు సందీప్ కు అరదండాలు
  • రాష్ట్రంలో సందీప్ పై 47 కేసులు
  • 14 రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సందీప్

నెల్లూరు పోలీసులు ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్ చేశారు. అతడి పేరు సందీప్. హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్ ఆషామాషీ క్రిమినల్ కాదు. అతడిపై దేశవ్యాప్తంగా 1000 వరకు కేసులున్నాయి. మనరాష్ట్రంలో 47 కేసులు నమోదయ్యాయి. సందీప్ ను అరెస్ట్ చేయడానికి 14 రాష్ట్రాల పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అయితే, ఏపీ పోలీసులు పక్కాగా వలపన్ని ఆ కేటుగాడ్ని పట్టుకున్నారు. నెల్లూరు దర్గామిట్ట ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి ఓ కారు, ఓ ఏటీఎం కార్డు క్లోనింగ్ యంత్రం, రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Criminal
Andhra Pradesh
Haryana
  • Loading...

More Telugu News