Chandrababu: చంద్రబాబు, జగన్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు

  • నాడు చంద్రబాబు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని మాట తప్పారు
  • రైతులకు రూ.12,500 జగన్ ఇస్తానన్నారు
  • అందులో కేంద్రం ఇచ్చే సొమ్ము కలిపారు

ఏపీలో నాటి, నేటి ప్రభుత్వాలపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నాడు చంద్రబాబు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని, ఆయన సీఎం అయిన తర్వాత రూ.24 వేల కోట్లకు కుదించారని విమర్శించారు. గత ఐదేళ్లలో రుణమాఫీ కింద రైతులకు ఇచ్చింది రూ.15 వేల కోట్లు మాత్రమే అని అన్నారు. ఇక, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఇస్తానన్న రూ.12,500.. కేంద్రం ఇచ్చే రూ.6000 కలిపి ఇస్తానని మోసం చేస్తున్నాడని విమర్శించారు. రైతులను మోసం చేసే విషయంలో నాడు చంద్రబాబుకు, ఇప్పుడు జగన్ కు ఏం తేడా లేదని ఆయన విమర్శించారు.

Chandrababu
Jagan
BJP
Vishnu Vardhan Reddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News