Sye Raa Narasimha Reddy: బెంగళూరులో 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఇదే!

  • సెప్టెంబర్ 29న బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • మాన్యత టెక్ పార్క్ ప్రాంతంలో వేడుకలు
  • అక్టోబర్ 2న సినిమా విడుదల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'సైరా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి చెందిన ట్రైలర్లు అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. మరోవైపు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి, రాంచరణ్ లతో పాటు చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఎల్లుండి (సెప్టెంబర్ 29) బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. నాగవార ప్రాంతంలోని మాన్యత టెక్ పార్క్ ప్రాంతంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఈవెంట్ ప్రారంభం అవుతుంది. మరోవైపు, అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

Sye Raa Narasimha Reddy
Bengaluru
Pre Release Event
Tollywood
Chiranjeevi
  • Loading...

More Telugu News