NASA: చంద్రుడిపై నాసా చిత్రాల్లోనూ జాడలేని మన విక్రమ్‌ ల్యాండర్‌

  • ఫొటోల్లో ఎక్కడా కనిపించని విక్రమ్‌
  • చీకటి బిలాల్లో చిక్కుకుని ఉంటుందని అంచనా
  • లూనార్‌ డే ప్రారంభమయ్యాక కొత్త చిత్రాలు తీస్తేనే తెలిసేది

చంద్రుడిపైకి మన ఇస్రో శాస్త్రవేత్తలు  ప్రతిష్టాత్మకంగా పంపించిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడ నాసా చిత్రాల్లోనూ దొరకక పోవడం నిరాశకు గురిచేసింది. చంద్రయాన్‌-2లో భాగంగా భారత్‌ పంపిన వ్యోమనౌక చివరి నిమిషం వరకు చక్కగా పనిచేసినా ఆఖరిలో ఫోర్స్‌ ల్యాండింగ్‌ జరిగి సమాచార సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. సిగ్నల్స్‌ పునరుద్ధరణకు ఇస్రో చేసిన అన్ని ప్రయత్నాలు  విఫలమయ్యాయి.

మరోవైపు విక్రమ్‌ జాడ కనుక్కునేందుకు సాయం చేస్తానని ముందుకు వచ్చిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విక్రమ్‌ కూలిపోయిందని భావిస్తున్న చోట తన లూనార్‌ రీకానిసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ)లోని కెమెరా ద్వారా పలు చిత్రాలు సేకరించింది. ల్యాండర్‌ పడిపోయిందని భావిస్తున్న ప్రాంతం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ఈ కెమెరా చిత్రాలు సేకరించింది.

అయితే ఈ చిత్రాల్లో ల్యాండర్‌ను గుర్తించలేకపోయామని నాసా ప్రకటించింది. చిత్రాల్లో పలుచోట్ల చీకటి బిలాలు ఉన్నాయని, బహుశా ఆ నీడ ప్రాంతంలో ల్యాండర్‌ ఉండి ఉండవచ్చునని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అక్టోబర్‌లో మళ్లీ లూనార్‌ డే ప్రారంభంకాగానే వెలుతురు ఉన్న సమయంలో మరోసారి చిత్రాలు తీసి పరిశీలిస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News