polavarm project: ఖర్చు తగ్గించి ‘పోలవరం’ నిర్మిస్తామంటే కేంద్రానికి అభ్యంతరం లేదు: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • రివర్స్ టెండరింగ్ తో డబ్బు ఆదా అయితే ఆహ్వానించదగ్గ పరిణామమే
  • రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది
  • పీపీఏలలో అవినీతి జరగలేదని చెప్పడం లేదు

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుందనుకుంటే అది ఆహ్వానించదగ్గ పరిణామమేనని అన్నారు. ఖర్చు తగ్గించి ఈ ప్రాజెక్టును నిర్మిస్తామంటే కేంద్రానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లకు సంబంధించి అవినీతి జరగలేదని తాము చెప్పడం లేదని, సూచన మాత్రమే చేశామని స్పష్టం చేశారు.

polavarm project
Reverse tender
BJP
mp
gvl
  • Loading...

More Telugu News