Somireddy: మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు... వాళ్ల గొంతు కోయొద్దు: సోమిరెడ్డి

  • గుంటూరులో సోమిరెడ్డి మీడియా సమావేశం
  • జీవో 38 రద్దుపై ఆగ్రహం
  • రాష్ట్రంలో అయోమయ పరిస్థితి నెలకొందన్న టీడీపీ నేత

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. పోలవరం విషయంలోనూ, రైతు రుణమాఫీ పథకం రద్దు విషయంలోనూ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన దుయ్యబట్టారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే వాళ్ల గొంతులు కోస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించే పరిస్థితి నెలకొందని అన్నారు.

రైతు రుణమాఫీ కోసం ఉద్దేశించిన జీవో 38ను రద్దు చేయడం దారుణమని, న్యాయస్థానాల తీర్పులను కూడా ఉల్లంఘించే పరిస్థితి తెచ్చుకుంటున్నారని విమర్శించారు. పీపీఏలు, పోలవరం వంటి విషయాల్లో అయోమయం నెలకొందని అన్నారు. ఇవాళ కేంద్రమంత్రి ఇచ్చిన వివరణ ఈ ప్రభుత్వం తీరును ఎండగడుతోందని వ్యాఖ్యానించారు. ఏపీ సర్కారు కేంద్రానికి రాసిన లేఖలకు కేంద్రమంత్రి స్పష్టంగా సమాధానమిచ్చారని తెలిపారు.

Somireddy
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News