Vijay Sai Reddy: లై డిటెక్టర్ ను కూడా బురిడీ కొట్టించగల గజదొంగలు ఆ ఇద్దరూ!: విజయసాయిరెడ్డి

  • వివాదాస్పదమైన చంద్రబాబు నివాస భవనం
  • నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం
  • అన్ని అనుమతులు ఉన్నాయంటున్న లింగమనేని 
  • ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి

వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు నివాసం గురించి వ్యాఖ్యానిస్తూ, కరకట్ట గెస్ట్ హౌస్ ను ప్రభుత్వానికి ఇచ్చేశా అని బినామీ అంటాడని, ల్యాండ్ పూలింగ్ కింద గుంజుకున్నాం అని బాసు వీడియోల సాక్షిగా చెప్పారని ట్వీట్ చేశారు. ఇప్పుడా గెస్ట్ హౌస్ బినామీ సొంతం అయిందని తెలిపారు. ప్రజలకు కళ్లు, చెవులు పనిచేయవనుకుంటున్నారో ఏమిటో అంటూ వ్యాఖ్యానించారు. ఏదేమైనా లై డిటెక్టర్ ను కూడా బురిడీ కొట్టించగల గజదొంగలు ఆ ఇద్దరు అంటూ విమర్శించారు. ప్రభుత్వం నుంచి కూల్చివేత నోటీసులు అందుకున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు అన్ని అనుమతులు ఉన్నాయని లింగమనేని రమేశ్ చెబుతుండడం తెలిసిందే. ప్రభుత్వం మాత్రం అది అక్రమ కట్టడమేనని అంటోంది.

Vijay Sai Reddy
Chandrababu
Lingamaneni Ramesh
  • Loading...

More Telugu News