Vijayanagaram: విజయనగరంలో దక్షిణాఫ్రికా, ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్ల మ్యాచ్... వాన దెబ్బకు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమైన ఆటగాళ్లు

  • విజయనగరంలో సఫారీలకు వార్మప్ మ్యాచ్
  • వర్షంతో తడిసి ముద్దయిన మైదానం
  • మధ్యాహ్నం వరకు ప్రారంభం కాని ఆట

టీమిండియాతో టెస్టు సిరీస్ కు ముందు వార్మప్ మ్యాచ్ తో ప్రాక్టీసు లభిస్తుందని ఆశించిన దక్షిణాఫ్రికా జట్టుకు నిరాశ ఎదురైంది. విజయనగరంలో బీసీసీఐ ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టుతో జరగాల్సిన మూడు రోజుల మ్యాచ్ కు వాన దెబ్బ తగిలింది. మ్యాచ్ తొలి రోజున మధ్యాహ్నం వరకు ఆట ప్రారంభం కాలేదు. భారీ వర్షం కారణంగా ఇక్కడి క్రికెట్ అకాడమీ మైదానం తడిసి ముద్దయింది. దాంతో ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూముకే పరిమితమయ్యారు. ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తుండగా, సఫారీ టీమ్ కు డుప్లెసిస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు.  తాజా సమాచారం ప్రకారం, మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు తొలిరోజు ఆట రద్దు చేసినట్టు తెలుస్తోంది.

Vijayanagaram
Cricket
South Africa
President's Eleven
  • Loading...

More Telugu News