TTD: బ్రహ్మోత్సవాల్లో బ్రేక్‌ దర్శనం ప్రోటోకాల్‌ వీఐపీలకే!: టీటీడీ ఈఓ స్పష్టీకరణ

  • వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
  • భక్తుల భద్రతకే తొలి ప్రాధాన్యం
  • అడ్వాన్స్‌ బుకింగ్‌ గదుల సంఖ్య 50 శాతం తగ్గింపు

తిరుమల గిరిపై జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యాలు, భద్రతకే పెద్దపీట వేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. ఉత్సవాలకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా బ్రేక్‌ దర్శనాలు కూడా ప్రోటోకాల్‌ వీఐపీలకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్‌ బుకింగ్‌ గదుల సంఖ్యను కూడా 50 శాతానికి కుదిస్తున్నట్లు స్పష్టం చేశారు.

TTD
Tirumala
brahmotsavalu
break darShan
VIP protocal
EO singhal
  • Loading...

More Telugu News