girl: ప్రియుడితో పెళ్లికి రెండేళ్లు ఆగలేను.. సారీ మమ్మీ: లేఖ రాసి బాలిక ఆత్మహత్య

  • హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో ఘటన
  • రెండేళ్లు ఓపిక పట్టాలన్న బాలిక తల్లిదండ్రులు
  • రెండేళ్ల తర్వాత పరిస్థితులను ఊహించడం కష్టమని మనస్తాపం

రెండేళ్లు ఆగితే ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ ఆ బాలిక వినిపించుకోలేదు. తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. గత కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉన్న బాలిక.. విషయం తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేయమని కోరింది. దీనికి సరేనన్న తల్లిదండ్రులు మైనర్ కావడంతో మరో రెండేళ్లు ఆగాలని సూచించారు.

తల్లిదండ్రుల మాటలను కాదని, ఈ నెల 20న మధ్యవర్తి ద్వారా ఓ ఖాజీని కలిసి విషయం చెప్పి పెళ్లి చేయమని కోరింది. అతడు కూడా బాలిక తల్లిదండ్రులు చెప్పినట్టుగానే మైనర్ కాబట్టి తానా పని చేయలేనని, రెండేళ్లు ఆగాలని హితవు పలికాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమని, ప్రేమించిన యువకుడితో పెళ్లి అవుతుందో, కాదో తెలియదని.. అందుకే ఉరివేసుకుని చనిపోతున్నట్టు సూసైడ్ లేఖలో పేర్కొంది. చివర్లో 'సారీ డాడీ.. సారీ మమ్మీ' అని రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

girl
suicide
Hyderabad
Crime News
  • Loading...

More Telugu News