IIFL: దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో తెలుగు పారిశ్రామికవేత్తలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-831d46fa319e45b94eb6f433b4d6500666cdda51.jpg)
- రూ. 13,400 కోట్ల సంపదతో మేఘా చైర్మన్‌కు 57వ స్థానం
- ఆ సంస్థ ఎండీకి 63వ స్థానం
- 83, 89వ స్థానాల్లో దివీస్ కిరణ్, నీలిమ
దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలవగా, ఆ జాబితాలో తెలుగు పారిశ్రామికవేత్తలకూ చోటు లభించింది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ సంస్థ బుధవారం దేశంలోని అత్యంత ధనవంతులైన వందమందితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో మేఘా చైర్మన్ పీపీ రెడ్డి 57వ స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తం రూ. 13,400 కోట్ల సంపదతో ఆయన ఈ స్థానంలో నిలవగా రూ.12,900 కోట్ల సంపదతో మేఘా ఎండీ పీవీకే రెడ్డి 63వ స్థానంలో నిలిచారు. దివీస్ ల్యాబ్‌కు చెందిన కిరణ్ 83వ స్థానంలోనూ, అదే సంస్థకు చెందిన నీలిమ 89వ స్థానంలోను నిలిచారు.