Kurnool District: కోడుమూరు టీడీపీ ఇన్ ఛార్జ్ అరెస్టును ఖండించిన చంద్రబాబు

  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు
  • దళిత కుటుంబాలను బహిష్కరించిన వారిపై చర్యలేవి?
  • బాధితుల తరఫున పోరాడుతున్న టీడీపీ నేతలపైనే తప్పుడు కేసులా?

కర్నూలు జిల్లాలోని కోడుమూరు టీడీపీ ఇన్ ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్టు చేయడంపై చంద్రబాబు స్పందించారు. ఈ అరెస్టును ఆయన ఖండిస్తూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఆత్మకూరులో 150 దళిత కుటుంబాలను బహిష్కరించిన వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. బాధితుల తరఫున పోరాడుతున్న టీడీపీ నేతలపైనే తప్పుడు కేసులా? ఎస్సీలకు న్యాయం చేయాలని పోరాడే వారిపైనే  అట్రాసిటీ కేసులా? అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వైసీపీ నేతల వైఖరిని ప్రజలు, మేధావులు, ఇతర పార్టీలు ఖండించాలని కోరారు.

  • Loading...

More Telugu News