polavaram: ‘అయ్యా, తుగ్లక్ ముఖ్యమంత్రి గారూ..’ అంటూ జగన్ పై లోకేశ్ విమర్శలు
- ‘పోలవరం’లో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచారు
- ఇది రివర్స్ టెండర్ వెనక ఉన్న అసలైన మేజిక్
- ‘పోలవరం’ నిర్మాణాన్ని అనుభవంలేని కంపెనీకి అప్పగిస్తారా!
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తాజాగా విమర్శలు, ఆరోపణలు, సెటైర్లు విసిరారు. ‘అయ్యా, తుగ్లక్ ముఖ్యమంత్రిగారూ’ అంటూ వరుస ట్వీట్లు చేశారు. 'ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో కట్టు కట్టించినట్టుంది జగన్ తెలివి' అని సెటైర్లు వేశారు. పోలవరం రివర్స్ టెండర్లలో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచిన లాజిక్, రివర్స్ టెండర్ వెనకున్న అసలైన మేజిక్ సామాన్య ప్రజలకూ అర్థమైంది’ అని ఆరోపించారు.
పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టును, కేవలం స్వప్రయోజనాల కోసం ఎటువంటి అనుభవంలేని కంపెనీకి అప్పగించడం తగదని, ఆ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం అని అభిప్రాయపడ్డారు. ప్రకాశం బ్యారేజీ గేటుకు అడ్డంగా బోటు పడితే తీయడానికి వారం రోజులు పట్టిందని, గోదావరిలో మునిగిన బోటును రెండు వారాలుగా తీయలేక, 144 సెక్షన్ పెట్టారని విమర్శించారు.