Comedian: వేణుమాధవ్ కు, నాకు ఇరవై ఐదేళ్ల సాన్నిహిత్యం: బండ్ల గణేశ్

  • వేణుమాధవ్ లేడన్న వార్త నన్ను చాలా బాధించింది
  • కళామతల్లి ఓ మంచి నటుడిని కోల్పోయింది
  • సుమారు ఏభై సినిమాల్లో కలిసి నటించాం

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ విచారం వ్యక్తం చేశారు. వేణుమాధవ్ లేడన్న వార్త తనను చాలా బాధించిందని, ఈరోజు చాలా దుర్దినం అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘లేడు’ అన్న మాట అనాలంటే తనకు చాలా ఇబ్బందిగా ఉందని, ఆ మాట నోట రావడం లేదని బాధతో అన్నారు.

కళామతల్లి ఓ మంచి నటుడిని కోల్పోయిందని, అందరితో సరదాగా, ఆప్యాయంగా ఉండేవాడని చెప్పారు. తమ ఇద్దరిదీ ఇరవై ఐదేళ్ల సాన్నిహిత్యం అని, దాదాపు ఏభై సినిమాల్లో కలిసి నటించామని చెప్పారు. ఈ మధ్య వేణుమాధవ్ ఆరోగ్యం బాగుండకపోతే వాళ్లింటికి వెళ్లానని, ‘జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం కాపాడుకో’ అని చెప్పానని.. ‘నాకు ఏం కాదు’ అని వేణు చెప్పేవాడని గుర్తుచేసుకున్నారు. వేణు మాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.

Comedian
Venumadhav
producer
Bandla Ganesh
  • Loading...

More Telugu News