Andhra Pradesh: ఏపీలో రైతు రుణమాఫీ పథకం రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం
- రూ. 7,959 కోట్ల బకాయిలను నిలిపివేసిన ప్రభుత్వం
- నిధులు లేకపోవడమే కారణం
- జీవో 99 విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేసింది. గత టీడీపీ హయాంలో ఉన్న 4, 5 విడతల బకాయిలను నిలిపివేసింది. రూ. 7,959 కోట్ల చెల్లింపులను ఆపేసింది. ఈ ఏడాది మార్చి 10న టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38ని రద్దు చేసింది. 4, 5 విడతల మొత్తంతో పాటు 10 శాతం వడ్డీని కలిపి గత ప్రభుత్వం జీవో 38 విడుదల చేసింది. గత ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా జీవో 99ని విడుదల చేసింది. వైయస్ఆర్ రైతు భరోసా పథకం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.