Rohith: కథ బాగోలేదని ముఖంపై చెప్పడమే నాకు మైనస్ అయింది: హీరో రోహిత్

  • '6 టీన్స్'తో హిట్ కొట్టిన రోహిత్ 
  • ఆ తరువాత పలకరించని సక్సెస్ లు 
  • కారణమదేనంటోన్న రోహిత్

తెలుగు తెరపై చాక్లెట్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోల్లో 'రోహిత్' ఒకరిగా కనిపిస్తాడు. తెలుగులో ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా సందడి చేసినప్పటికీ, '6 టీన్స్' సినిమా ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ, క్రమేపి చిత్రపరిశ్రమకి ఆయన దూరమవుతూ వచ్చాడు.

తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేను హీరోగా చేసేటప్పుడు .. వరుసగా కథలు వినేవాడిని. స్క్రిప్ట్ బాగుంటేనే ఓకే చెప్పేవాడిని. కథ నచ్చకపోతే ఆ విషయం చెప్పడానికి నాన్చేవాడిని కాదు .. నచ్చలేదని వెంటనే చెప్పేసేవాడిని. ఎందుకంటే ఆ దర్శకుడు మరో ప్రయత్నం చేసుకుంటాడని భావించేవాడిని. కానీ రోహిత్ ఎంతమాత్రం ఆలోచించకుండా ముఖానే చెప్పేస్తాడనే ప్రచారం జరిగిపోయింది. నా కారణంగా కొంతమంది దర్శకుల అవకాశాలు కూడా పోతాయనే ఆలోచన అప్పట్లో నాకు లేదు. దాంతో నాకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి" అని చెప్పుకొచ్చాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News