Demi Moore: 15 ఏళ్ల వయసులోనే అత్యాచారానికి గురయ్యాను: హాలీవుడ్ స్టార్ డెమీమూర్

  • నా కన్నతల్లే నన్ను ఓ వ్యక్తికి అమ్మేసింది
  • తన ఆత్మకథలో వెల్లడించిన డెమీ మూర్
  • 'ఇన్ సైడ్ అవుట్' పేరుతో ఆత్మకథ

సినీ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఎందరో స్టార్ల జీవితాల వెనుక బాధాకరమైన చీకటి కోణాలు కూడా ఉంటాయి. ఈ జాబితాలో హాలీవుడ్ స్టార్ డెమీ మూర్ కూడా ఉంది. పలు రొమాంటిక్ చిత్రాల్లో నటించిన డెమీ మూర్... ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజాగా తన ఆత్మకథ 'ఇన్ సైడ్ అవుట్'లో పలు సంచలన విషయాలను ఆమె వెల్లడించింది.

15 ఏళ్ల వయసులోనే తాను అత్యాచారానికి గురయ్యానని డెమీమూర్ తన ఆత్మకథలో పేర్కొంది. తన కన్నతల్లే తనను ఓ వ్యక్తికి 500 డాలర్లకు అమ్మేసిందని తెలిపింది. ఇలాంటి విషయాలతో పాటు బ్రూస్ విల్లీస్ తో తన ప్రేమాయణం, పెళ్లి వరకు వెళ్లి బంధం తెగిపోవడం, తనకన్నా చిన్నవాడైన కుచర్ తో డేటింగ్ వంటి ఎన్నో వ్యక్తిగత విషయాలను వెల్లడించింది.

Demi Moore
Hollywood
Biography
Rape
  • Loading...

More Telugu News