amthurth pranya: ప్రణయ్‌ని మర్చిపో ...లేదంటే...?: లేఖ ద్వారా అమృతకు బెదిరింపులు

  • ఇంటి వద్ద లెటర్‌ వదిలి వెళ్లిన ఆగంతుకుడు
  • అమృత అత్తమామల ఆవేదన
  • పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచన  

పరువు హత్యగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య జరిగి ఇన్ని నెలలు గడిచిపోయినా అతని భార్య అమృతకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈనెల 11వ తేదీన ప్రణయ్‌ వర్ధంతి రోజున గుర్తు తెలియని దుండగుడు అమృత ఇంట్లోకి ప్రవేశించి ఓ లేఖ వదిలి వెళ్లాడు. బైక్‌పై వచ్చిన ఈ ఆగంతుకుడు ఆ లేఖను వదిలినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ‘ఇప్పటికైనా ప్రణయ్‌ని మర్చిపో. లేదంటే...?’ అంటూ ఆ లేఖలో హెచ్చరిక ఉన్నట్లు అమృత తెలిపింది.

ఇక భర్త ప్రణయ్‌ హత్య నాటికి అమృత ఐదు నెలల గర్భవతి. ఆ తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ బిడ్డను చూసుకుంటూ అత్తవారింట్లోనే అమృత ఉంటోంది. ఇటువంటి సమయంలో బెదిరింపులపై అమృత అత్తమామలు ఆందోళన వ్యక్తం చేశారు. మా కోడలిని మానసికంగా హింసించేందుకే గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేస్తున్నారని వాపోయారు. దీనిపై ప్రణయ్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.

amthurth pranya
warnigs
unknown persons
Nalgonda District
miryalaguda
  • Loading...

More Telugu News