Maharashtra: ఈ దొంగలు ముదుర్లు.. 25 టన్నుల ఉల్లిగడ్డల చోరీ!

  • మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘటన 
  • వేసవి కోసం నిల్వ చేసిన రైతు
  • లక్ష రూపాయల విలువైన ఉల్లిగడ్డల చోరీ

ఎక్కడైనా దొంగలు మామూలుగా డబ్బు కానీ, బంగారం కానీ దోచుకెళుతుంటారు. ఈ దొంగలు మాత్రం కాస్త ముదుర్లు.. అందుకే ఉల్లిగడ్డలు చోరీ చేశారు. ఉల్లిధరలు కొండెక్కడంతో ఇదే మంచి అదును అనుకున్న చోరులు ఏకంగా 25 టన్నుల ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లి తాము సీజనల్ దొంగలమని నిరూపించుకున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.

స్థానిక రైతు బజ్‌రావు తన ఇంట్లో లక్ష రూపాయల విలువైన ఉల్లిగడ్డలను నిల్వచేశాడు. మొత్తం 117 ప్లాస్టిక్ డబ్బాల్లో 25 టన్నుల ఉల్లిగడ్డలను వేసవి అమ్మకం కోసం నిల్వ చేశాడు. ఉల్లిధరల నేపథ్యంలో ఈ స్టాక్‌పై కన్నేసిన కొందరు దొంగలు రాత్రికి రాత్రే ఉల్లిగడ్డల బస్తాలను దోచుకుపోయారు. ఉదయం గమనించిన బజ్‌రావు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు. రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఉల్లిదొంగల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News