Telangana: తమిళనాడు ఉప ఎన్నికలో బరిలోకి దిగనున్న తెలంగాణ గవర్నర్ తండ్రి అనంతన్

  • శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతన్ సోదరుడు
  • వచ్చే నెలలో నన్గునేరి నియోజక వర్గానికి ఉప ఎన్నిక
  • కాంగ్రెస్ టికెట్ కోసం అనంతన్ ప్రయత్నాలు

తమిళనాడులోని నన్గునేరి నియోజక వర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తండ్రి కుమరి అనంతన్‌ కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 21న తిరునల్వేలి జిల్లా నన్గునేరి నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న తమిళిసై తండ్రి అనంతన్ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆయన సోదరుడు హెచ్.వసంతకుమార్ నిన్నమొన్నటి వరకు ఇదే నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, పార్లమెంటు ఎన్నికల్లో గెలవడంతో ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

Telangana
governor
ananthan
by-election
Tamilisai Soundararajan
  • Loading...

More Telugu News