Alla Ramakrishna Reddy: లింగమనేని గెస్ట్ హౌస్ కు ఒక్క అనుమతి కూడా లేదు.. బహిరంగ చర్చకు సిద్ధమా?: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

  • వివాదాస్పదంగా మారిన లింగమనేని గెస్ట్ హౌస్
  • బహిరంగ చర్చ ఎక్కడ ఏర్పాటు చేసినా వస్తానంటూ వ్యాఖ్యలు
  • రేపు మీడియా ముందుకు ఆధారాలతో వస్తానన్న ఆర్కే

కృష్ణా నది కరకట్ట వెంబడి ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ కు ఒక్క అనుమతి కూడా లేదని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో లింగమనేని లేదా చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. బహిరంగ చర్చ ఎక్కడ ఏర్పాటు చేసినా తాను వస్తానని అన్నారు. రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో దీనిపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రజలు, మీడియా ముందు ఆధారాలతో వాస్తవాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

Alla Ramakrishna Reddy
YSRCP
Chandrababu
Lingamaneni Ramesh
Telugudesam
  • Loading...

More Telugu News