Hyderabad: హైదరాబాద్ లో ఎంఎన్సీ ఉద్యోగిని ఆత్మహత్య!

  • టీసీఎస్ లో హెచ్ ఆర్ విభాగంలో పనిచేస్తున్న మహితి
  • ఐదు అంతస్తుల బిల్డింగ్ పై నుంచి  దూకి ఆత్మహత్య
  • కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు

హైదరాబాద్ లో ఓ ఎంఎన్సీ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. టీసీఎస్ లో హెచ్.ఆర్ విభాగంలో పని చేస్తున్న మహితి అనే యువతి మదీనాగూడలోని ల్యాండ్ మార్క్ రెసిడెన్సీ అపార్టు మెంట్ లో వుంటోంది. ఈ రోజు ఐదు అంతస్తుల ఆ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. మహితి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ, ఆమె వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వుండవచ్చని అన్నారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News