Hyderabad: హైదరాబాద్ లో కుండపోత వర్షం ఎఫెక్ట్.. పలు ప్రాంతాల్లో నిలిచిన ట్రాఫిక్!

  • ఆయా ప్రాంతాలు జలమయం
  • వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన టూవీలర్లు
  • చాలా చోట్ల కదలని వాహనాలు

హైదరాబాద్, సికింద్రాబాద్ సహా శివారు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం కుండపోత వర్షం కురవడంతో ఆయా ప్రాంతాలు జలమయం కాగా, చాలా చోట్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. సికింద్రాబాద్ లోని బోయినపల్లి హైవేపై భారీగా వరద నీరు నిలిచిపోయింది.

పంజాగుట్ట- సికింద్రాబాద్ వరకు, గచ్చిబౌలి, ఇనార్బిట్ మాల్, సైబర్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలడం లేదు. యూటర్న్ ల కారణంగా మరింత ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పలు చోట్ల రోడ్లపైన వరద ప్రవాహం కారణంగా ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత వరకు రోడ్లపైకి రావొద్దని నగరవాసులకు పోలీసులు సూచించారు.

Hyderabad
Secunderabad
Rain
Traffic
  • Loading...

More Telugu News