Pakistan: పాకిస్థాన్ కేంద్రంగా భూకంపం.. ఉత్తరభారతంలో భూ ప్రకంపనలు!

  • లాహోర్ కు 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం
  • భూకంప తీవ్రత 6.1గా నమోదు
  • ఢిల్లీ, హర్యానా, పంజాబ్, కశ్మీర్ లో కంపించిన భూమి  

పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. ఇస్లామాబాద్, రావల్పిండిలో భూ ప్రకంపనలు రావడంతో భయాందోళనలకు గురైన ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.

లాహోర్ కు 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు సమాచారం. కాగా, పాక్ లో భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంపై పడింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, కశ్మీర్ లలో భూమి కంపించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఢిల్లీలో భూమి కంపించినట్టు సమాచారం.

Pakistan
Earthquake
Delhi
Haryana
Punjab
  • Loading...

More Telugu News