KCR: హరీశ్ రావుకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఆర్థికమంత్రి పదవి ఇచ్చారు: సంపత్

  • రైతులకు రుణమాఫీ జరగడం లేదు
  • 50 శాతం మంది రైతులకు రైతుబంధు అందలేదు
  • ఇచ్చిన హామీలను కేసీఆర్ అటకెక్కించారు

ప్రజా సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కాంగ్రెస్ నేత సంపత్ విమర్శించారు. రైతులకు రుణమాఫీ జరగడం లేదని చెప్పారు. 50 శాతం మంది రైతులకు రైతుబంధు నిధులు అందలేదని దుయ్యబట్టారు. రైతుబంధు, రుణమాఫీ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో గెలుపొందేందుకు అక్కడ రుణమాఫీ, రైతుబంధు ఇస్తున్నారని మండిపడ్డారు. రైతులకు యూరియా కూడా అందుబాటులో లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ అటకెక్కించారని విమర్శించారు. హరీశ్ రావుకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఆయనకు ఆర్థికమంత్రి పదవి ఇచ్చారని తెలిపారు.

KCR
Harish Rao
TRS
Sampath
Congress
  • Loading...

More Telugu News