Giriraj Singh: నా రాజకీయ జీవితం చివరి దశకు వచ్చేసింది: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

  • మోదీ రెండో టర్మ్ పూర్తి కాగానే నా కెరీర్ కు తెర పడుతుంది
  • జమ్మూకశ్మీర్ భారత్ లో అంతర్భాగం కావాలనేది మా ఆకాంక్ష
  • ఆ కోరికను మోదీ తీర్చారు

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చేసిందని చెప్పారు. ప్రధానిగా మోదీ రెండో టర్మ్ పూర్తి చేసుకున్న వెంటనే తన పొలిటికల్ కెరీర్ కు తెర పడుతుందని అన్నారు.

జమ్మూకశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేయాలని కోరుతూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ తన ప్రాణాలను త్యాగం చేశారని... ఆ కలను సాకారం చేయాలనే లక్ష్యంతో పార్టీలో చేరిన నేతల్లో తాను కూడా ఒకడినని చెప్పారు. తమ కలను ప్రధాని మోదీ సాకారం చేశారని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో తన పొలిటికల్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందని తాను భావిస్తున్నానని చెప్పారు.

Giriraj Singh
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News