Polavaram project: మంత్రి అనిల్ సవాల్ ను స్వీకరిస్తున్నాం: టీడీపీ నేత అశోక్ బాబు

  • ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి
  • అలా చేయకపోతే జరిగే నష్టాన్ని చెప్పాలి
  • రివర్స్ టెండరింగ్ ఓ  చీకటి ఒప్పందం 

రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి చూపిస్తే కనుక టీడీపీని మూసేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అన్న ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విసిరిన సవాల్ పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. అనిల్ కుమార్ సవాల్ ను స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువు లోగా పూర్తి చేయకుంటే జరిగే నష్టాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రివర్స్ టెండరింగ్ పై ఆయన విమర్శలు చేశారు. చీకటి ఒప్పందం చేసుకుని, ఇతర కాంట్రాక్టర్లను రానీయకుండా బెదిరించారని ఆరోపించిన అశోక్ బాబు, రివర్స్ టెండరింగ్ పై విచారణకు అంగీకరించాలని, ఈ టెండరింగ్ పై బహిరంగ చర్చకు సిద్ధమేనని ప్రశ్నించారు.

Polavaram project
Minister
Anil kumar yadav
Ashok Babu
Telugudesam
MLC
  • Loading...

More Telugu News