Narayanamurthi: నా జేబులో లక్ష వున్నా .. ఒక్క రూపాయి లేకపోయినా ఒకేలా వుంటాను: ఆర్. నారాయణ మూర్తి
- వైట్ డ్రెస్ వేసుకోవడం ఇష్టం
- సర్దుకుపోవడం నాకు అలవాటు
- సంతృప్తిగా బతకడం ఇష్టమన్న నారాయణమూర్తి
నటుడిగా .. దర్శక నిర్మాతగా ఆర్.నారాయణమూర్తికి ప్రత్యేకమైన స్థానం వుంది. ఆయన సినిమాలు సామాజిక స్పృహను కలిగించేవిగా .. యువత స్ఫూర్తిని పొందేవిగా ఉంటాయి. జయాపజయాలను పెద్దగా పట్టించుకోకుండా, సామాజిక సందేశంతో కూడిన సినిమాలు చేసుకుంటూ ఆయన వెళుతుంటారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "చిన్నప్పటి నుంచి నాకు వైట్ డ్రెస్ వేసుకోవడమంటే ఇష్టం. మనసుకి సంతోషం కలిగేలా జీవిస్తున్నామా లేదా? సంతృప్తికరంగా వుంటున్నామా లేదా? అనేదే నేను ఆలోచిస్తాను.
ఎంత అవసరమో ఆ మేరకు సంపాదించుకుంటే చాలనేది నా ఉద్దేశం. ఇల్లు కట్టుకోవాలి .. కారు కొనుక్కోవాలి .. విలాసవంతంగా బతకాలని నేను కోరుకోను. అవసరాన్నిబట్టి ఆటో ఎక్కుతాను .. లేదంటే విమానం ఎక్కుతాను. వీలైతే స్టార్ హోటల్లో భోజనం చేస్తాను .. లేదంటే రోడ్డు పక్కనున్న హోటల్లో తింటాను. నాకు అందుబాటులో వున్న వాటితోనే నేను సర్దుకుపోతాను .. అదే నా లైఫ్ స్టైల్" అని ఆయన చెప్పుకొచ్చారు.