Huzurunagar: హుజూర్ నగర్ లో 30 వేల మెజార్టీతో గెలుస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా

  • కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
  • టీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది
  • హుజూర్ నగర్ కు జగదీశ్ రెడ్డి చేసింది ఏమీ లేదు

హుజూర్ నగర్ లో త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని, ముప్పై వేల మెజార్టీతో గెలుస్తామని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు. టీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని నిప్పులు చెరిగారు. హుజూర్ నగర్ కు టీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి చేసింది ఏమీ లేదని, ఒక్క రూపాయి పని కూడా చేయలేదని విమర్శించారు. ఉపఎన్నిక భయంతోనే ‘రైతుబంధు’ పథకం డబ్బులు విడుదల చేశారని, ఈ ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని విమర్శించారు.

Huzurunagar
congress
Uttam Kumar Reddy
TRS
  • Loading...

More Telugu News