Vizag: టీడీపీ హయాంలో విశాఖను అభివృద్ధి చేయకపోగా దోచుకున్నారు: వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్

  • భూ కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కోటరీ దోచుకుంది
  • పులివెందుల వ్యక్తులు వసూళ్లకు పాల్పడటం అబద్ధం
  • జగన్ పాలనలో విశాఖకు మంచిరోజులు వస్తాయి  

టీడీపీ హయాంలో విశాఖను అభివృద్ధి చేయకపోగా, భూ కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కోటరీ దోచుకుందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖకు పులివెందుల నుంచి కొందరు వ్యక్తులు వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని చంద్రబాబు, ఎల్లోమీడియా అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

సీఎం జగన్ పాలనలో విశాఖకు మంచిరోజులు రాబోతున్నాయని చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే పత్రికలు భరించలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. ఈ విషయమై విశాఖ నగర కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విశాఖను అభివృద్ధి చేసింది నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.

Vizag
Telugudesam
YSRCP
Amarnath
Jagan
  • Loading...

More Telugu News